ఇనుగుర్తి లో హోలీ సంబరాలు
విశ్వంభర, ఇనుగుర్తి: మండలం కేంద్రం ఇనుగుర్తి తో పాటు మండలంలోని వివిధ గ్రామాలలో మంగళవారం ఆనందోత్సాహాల మధ్య రంగుల పండుగ హోలీని ఘనంగా జరుపుకున్నారు. సహజ సిద్ధమైన రంగులను చల్లుకుంటూ,కేరింతలు కొడుతూ ఒకరికొకరు రంగులు పూసుకున్నారు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఆబాల గోపాలం కలర్స్ లో మునిగి తేలారు. వివిధ గ్రామాల్లో సర్పంచులు,వార్డు సభ్యులు,వివిధ పార్టీల నాయకులు,యువకులు, మహిళలు,యువతులు, విద్యార్థులతో పాటు అన్ని వర్గాల ప్రజలు తమ బిజీ లైఫ్ ను పక్కనపెట్టి వసంతాగమనం పురస్కరించుకొని హోలీ ఆయారే అంటూ ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. ఆప్యాయంగా పలకరిస్తూ రంగులు పూస్తూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మండలంలోని చిన్ననాగారంలో జరిగిన హోలీ సంబరాలలో సర్పంచ్ చెడుపాక సుజాత యాకయ్య, ఉపసర్పంచి తుమ్మనపల్లి సతీష్ చారి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బైరు అశోక్ గౌడ్,వార్డు సభ్యులు నిడిగంటి చంద్రమౌళి,చెడుపాక అలివేలు వెంకన్న, నాయకులు యువకులు నాయిని కొమరయ్య,కొయ్యడి కృష్ణ కాంత్, చెడుపాక దర్గయ్య, శేఖర్, వెంకన్న,బైరు వినయ్ కుమార్,కార్తీక్,రాజు,అబ్బాటి మధు,కురిమల సతీష్,జంపయ్య,గడ్డం నాగరాజు,మిట్ట కడుపుల యాకన్న తదితరులు పాల్గొన్నారు



