దేవినేని చెతిన్ చక్రవర్తి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో కమ్మ కార్పొరేషన్ చైర్మన్ కు గద్దె విజయ్ నేత ఘన సత్కారం.
*చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి ప్రమాణ స్వీకారం లో పాల్గొన్న తెలంగాణ టీడీపీ నేతలు*
On
విశ్వంభర, తాడేపల్లి :- ఆంధ్రప్రదేశ్ కమ్మ సంక్షేమం , అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన నాదెండ్ల బ్రహ్మం చౌదరి ప్రమాణ స్వీకార మహోత్సవమునకు దేవినేని చెతిన్ చక్రవర్తి ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని తాడేపల్లికి బి.ఎన్.రెడ్డి టిడిపి కాంటెస్ట్ కార్పోరేటర్ గద్దె విజయ్ నేత కార్యక్రమంలో పాల్గొని వారికి ఘనంగా గజమాలతో సత్కారం చేయడం జరిగింది. ఈ సందర్బంగా విజయ్ నేత మాట్లాడుతూ బ్రహ్మం చౌదరి కార్పొరేషన్ చైర్మన్ గా పదవి భాద్యతలు చేపట్టడం చాల సంతోషంగా ఉందని అన్నారు. తెలుగుదేశం పార్టీలో నిబద్దతతో పని చేసేవారికి, కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు ఎప్పటికైనా మంచి పదవులు లభిస్తాయని , అది కేవలం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం అని అన్నారు. ఎంతో మంది కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ మంచి అవకాశాలు కల్పించిందని ఈ సందర్బంగా గుర్తు చేశారు. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం , సీఎం చంద్రబాబు నాయుడు ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింత అభివృద్ధి దిశగా దేశంలోనే గొప్ప రాష్ట్రంగా ముందుకు సాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నుండి విజయ్ నేత వెంట ఆర్కే రామకృష్ణ, సుధాకర్ , ప్రవీణ్, శివ, సాయి తదితరులు పాల్గొన్నారు.



