వెంకటలక్ష్మికి మహిళా కీర్తిరత్న పురస్కారం

వెంకటలక్ష్మికి మహిళా కీర్తిరత్న పురస్కారం

విశ్వంభర,నెల్లికుదురు: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం వస్రాం తండా పరిధి లాలు తండా కు చెందిన అంగన్వాడీ టీచర్, కవయిత్రి, ప్రముఖ జానపద కళాకారిణి తొట్ల వెంకటలక్ష్మిని మహిళా కీర్తిరత్న పురస్కారం వరించింది.దీంతో ఆమె ప్రతిభా కీర్తి కి  మరో కలికి తురాయి చేరింది. శ్రీశ్రీ కళావేదిక సాహిత్య సంస్థ వారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ అంతర్జాతీయ సీఈవో కత్తిమండ ప్రతాప్ చేతుల మీదుగా మంగళవారం వెంకటలక్ష్మి అవార్డు,జ్ఞాపిక, ప్రశంసా పత్రం అందజేశారు. శాలువాతో ఘనంగా సత్కరించా రు. శ్రీశ్రీ కళావేదిక వారు అందజేసిన మహిళా కీర్తిరత్న అవార్డుతో సమాజం పట్ల తనకు మరింత బాధ్యత పెరిగిందని పురస్కార గ్రహీత కవయిత్రి తొట్ల వెంకటలక్ష్మి అన్నారు. అవార్డు అందుకోవడం పట్ల ఆనందంగా ఉందని చెప్పారు. వేదికపై తాను ఆశువుగా మహిళలపై ఆలపించిన ఎక్కడమ్మా నువ్వు లేనిది ఏమిటమ్మా నీవు చేయనిది అనే కవితకు సబికులు ప్రశంసలతో ముంచేత్తారన్నారు.

Tags: