మానుకోటలో హోలీ సంబరాలు
విశ్వంభర, మహబూబాబాద్: మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో హోలీ పండుగను ఆనందోత్సాహాలతో, సాంప్రదాయబద్దంగా ఘనంగా జరుపుకున్నారు. హోలీకి ముందు రోజు “కామదహనం” నిర్వహించారు, చెడు పై మంచి విజయం సాధించినదానికి సంకేతంగా అగ్నికుండం వెలిగిస్తారు. గ్రామాల్లో ప్రజలు కలిసి భజనలు, హారతులు చేశారు. పిల్లలు, యువకులు రంగులు చల్లి సంతోషంగా జరుపుకున్నారు. గులాల్, నీటి రంగులతో ఒకరినొకరు అలంకరించుకుంటూ ఆనందించారు. మహిళలు, యువతులు కలిసి కోలాటాలు ఆడుతూ, జానపద గీతాలు పాడుతూ హోలీని ఉత్సాహంగా జరుపుకున్నారు. హోలీ పండుగలో కులమత భేదాలు లేకుండా అందరూ కలిసి ఆనందించడం తెలంగాణలో ప్రత్యేకత. పాత విభేదాలు మరిచి కొత్త స్నేహాలను ఆహ్వానించే రోజు ఇది,తెలంగాణలో హోలీ పండుగ రంగుల సందడి మాత్రమే కాదు, సంస్కృతి–సాంప్రదాయాల ప్రతిబింబం కూడా. ఆనందం, ఐక్యత, స్నేహభావాలను పెంపొందించే పండుగగా హోలీ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఈ కార్యక్రమంలో పిల్లలు యువకులు రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు.



