టీచర్స్ కాలనీలో ఘనంగా హోలీ 

టీచర్స్ కాలనీలో ఘనంగా హోలీ 

విశ్వంభర, పరిగి:  మున్సిపాలిటీ పరిధిలోని టీచర్స్ కాలనీలో స్థానిక కౌన్సిలర్ వారాల రవీంద్ర ఆధ్వర్యంలో హోలీ సంబరాలు ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరిగాయి. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ కేరింతలు కొడుతూ ఉత్సాహంగా చిందులేశారు. ఇండ్లకు వెళ్లి ఒకరిపై ఒకరు రంగులు వేసుకొని సంతోషంగా హోలీ పండుగ జరుపుకున్నారు. దీంతో కాలనీలో పండగ వాతావరణం చోటు చేసుకున్నట్లు కౌన్సిలర్ వారాల రవీంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో గురు, విజయ్ కుమార్ రెడ్డి, బసవరాజ్, ఉపాధ్యాయులు,తదితరులు పాల్గొన్నారు.

Tags: