ఉత్సాహంగా హోలీ వేడుకలు

ఉత్సాహంగా హోలీ వేడుకలు

విశ్వంభర, హైదరాబాద్ : హోలీ పండుగను  హైదరాబాదులో  ఉత్సాహంగా నిర్వహించారు. నగరంలోని పలు కాలనీలు, వీధుల వద్ద యువతతో పాటు పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొని రంగులు చల్లుకుంటూ ఆనందంగా సంబరాలు జరుపుకున్నారు. డీజే సంగీతం, నృత్యాలతో నగరంలో హోలీ వాతావరణం నెలకొంది. చిన్నారులు, యువకులు గుంపులుగా చేరి ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సందడి చేశారు. కొన్ని ప్రాంతాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. పోలీసులు పలు చోట్ల భద్రతా ఏర్పాట్లు చేపట్టి వేడుకలు ప్రశాంతంగా సాగేందుకు చర్యలు తీసుకున్నారు.

Tags: