ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి
On
విశ్వంభర, కుత్బుల్లాపూర్: సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో హోలీ పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. విశ్వకర్మ కాలనీలో ఉంటున్న సాగర్(17), అభిషేక(18) లు సూరారం పంతులు చెరువులో ఈతకు వెళ్లి మృతి చెందారు. స్దానికుల సమాచారం తో సూరారం పోలీసులు డిఆర్ఎఫ్ బృందం సహాయం తో మృత దేహాలను బయటికి తీసి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి కి తరలించారు. సూరారం పి.యస్ పరిధి విశ్వకర్మ కాలనీలో ఉంటున్న సాగర్, అభిషేక్ మంగళవారం ఉదయం హోలీ సంభరాలు జరుపుకొని స్నానానికని వెళ్లి చెరువులో మునిగి చనిపోయినట్టు పోలీసులు వెల్లడించారు . వీరు బహదూర్ పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయిర్ చదువు తున్నారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు తో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు సూరారం పోలీసులు తెలిపారు.



