మూసీ ఆక్రమణలపై నిరసనకు మద్దతు
On
విశ్వంభర, నార్సింగి :నార్సింగిలో మూసీ నదిని ఆక్రమించి నిర్మిస్తున్న రియల్ ఎస్టేట్ వెంచర్‌పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన నిరసన కార్యక్రమానికి హరి బౌలి డివిజన్ నాయకులు మద్దతు తెలిపారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో ప్రజల నివాసాలు తొలగిస్తామని చెబుతున్న ప్రభుత్వం అక్రమ వెంచర్‌పై కూడా స్పందించాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసనకు మద్దతుగా రాకేష్ గైక్వాడ్, శ్రీకర్ శర్మ, రాజు కుమార్, ఓంకార్ స్వామి, నిలయ్ భూషణ్ రాయ్ ఆస్థానా, నితిన్, నవీన్, రూప్ సింగ్, సచిన్, శశి, పల్లవి, ముఖేష్, రాహుల్, శ్రీకాంత్ పాల్గొన్నారు.



