పరిగిలో హోలీ సంబరాలు

పరిగిలో హోలీ సంబరాలు

విశ్వంభర, పరిగి:  మున్సిపాలిటీ పరిధిలోని మార్కెట్ యార్డులో గ్రీన్ మర్చంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ఐక్యమత్యంగా ఒకరిపై ఒకరు వివిధ రకాల రంగులు చల్లుకుంటూ ఆనంద ఉత్సవాల మధ్య హోలీ సంబరాలు జరుపుకున్నారు. దీంతో మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో పండగ వాతావరణం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు శ్రీనివాస్, కార్యదర్శి వేణుగోపాల్, ట్రెజరీ నాగరాజు, గ్రీన్ మర్చంట్ అసోసియేషన్ సభ్యులు ఈశ్వరప్ప, వీరేశం, వీరేష్, రాజేష్, విజయ్, రవి, రాజు, తదితరులు పాల్గొన్నారు.

Tags: