7నుండి మహిళల టీ20 క్రికెట్ పోటీలు
On
విశ్వంభర, బాగ్ లింగంపల్లి: ఈ నెల 7 నుంచి 9 వరకు ఉప్పుగూడ జీఎన్‌ఆర్ గ్రౌండ్‌లో మొదటి జాతీయ మహిళల డెఫ్ టీ20 క్రికెట్ పోటీలు నిర్వహించనున్నట్లు టీఎస్‌సీఏడీ రాష్ట్ర అధ్యక్షుడు టీ. చిరంజీవి, రాష్ట్ర కార్యదర్శి వల్లభనేని ప్రసాద్ తెలిపారు. బాగ్ లింగంపల్లి లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ డీఫ్ మేనేజర్ రేవతి ఆధ్వర్యంలో ఆరు రాష్ట్రాల జట్లు పాల్గొంటాయని పేర్కొన్నారు. జట్టు ఎంపికను కెప్టెన్ ఎనిమల్, వైస్ కెప్టెన్ సమీరా, హెడ్ కోచ్ బి. రమేష్ పర్యవేక్షణలో నిర్వహించినట్లు తెలిపారు. పోటీల్లో విజేతలకు కప్‌తో పాటు ప్రోత్సాహక బహుమతులు అందజేయనున్నట్లు వెల్లడించారు.



