టీ20 క్రికెట్ పోటీలు విజయవంతం
On
విశ్వంభర, హైదరాబాదు : తెలంగాణ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ది డెఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మొదటి జాతీయ మహిళల చెవిటి టీ20 క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. ఈ పోటీల్లో తెలంగాణ, విదర్భ, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన 96 మంది క్రీడాకారిణులు పాల్గొన్నారు. టోర్నమెంట్‌లో తెలంగాణ జట్టు విజేతగా నిలిచి రూ.1,52,000 నగదు బహుమతి అందుకోగా, విదర్భ జట్టు రన్నరప్‌గా నిలిచి రూ.75,200 బహుమతి సాధించింది. విజేతలు, రన్నరప్ జట్లకు ట్రోఫీలు, పతకాలు ప్రదానం చేశారు. ఉత్తమ క్రీడాకారిణులకు ప్రత్యేక బహుమతులు అందజేశారు. పోటీల నిర్వహణలో సంఘం అధ్యక్షుడు టి చిరంజీవి, ప్రధాన కార్యదర్శి వి తదితరులు కీలక పాత్ర పోషించారు. కార్యక్రమంలో నిర్వాహకులు, క్రీడాకారిణులు పాల్గొన్నారు.



