తెలంగాణ రాష్ట్ర హెరిటేజ్ డైరెక్టర్ గా భాద్యతలు స్వీకరించిన ప్రొఫెసర్ అర్జునరావు కుతాడి
విశ్వంభర,హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పురావస్తు & మ్యూజియంల విభాగానికి కొత్త డైరెక్టర్‌గా ఉస్మానియా యూనివర్సిటీ మాజీ ప్రిన్సిపాల్, డీన్ మరియు చరిత్ర శాఖ అధ్యక్షులు సీనియర్ప్రొఫెసర్ అర్జున్ రావు కూతాడిను నియమించింది.ప్రొఫెసర్ అర్జున్ రావు కూతాడి చరిత్ర, సాంస్కృతిక వారసత్వం, పురావస్తు రంగాలలో విశిష్టమైన సేవలు అందించి, శాస్త్రీయ పరిశోధనల్లో విశేష కృషి చేశారు. ఆయన అనేక జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో తెలంగాణ చరిత్ర, సంస్కృతి, పురావస్తు ప్రాధాన్యాన్ని వివరించారు.
డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలోని చారిత్రక స్మారకాలు, వారసత్వ కట్టడాలు, మ్యూజియంల అభివృద్ధి, సంరక్షణ, ఆధునికీకరణపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు ప్రొఫెసర్ కూతాడి తెలిపారు. అలాగే, తెలంగాణ ప్రాచీన చరిత్రను ప్రపంచానికి పరిచయం చేయడంలో మరింత ముందడుగు వేయాలని తన సంకల్పాన్ని వ్యక్తం చేశారు. ఈ అవకాశం కల్పించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి, మంత్రి జూపల్లి కృష్ణ రావుకి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు.
ఈ సందర్భంగా చరిత్రకారులు, విద్యావంతులు, మేధావులు, పరిశోధకులు ప్రొఫెసర్ అర్జున్ రావు కూతాడికి అభినందనలు తెలియజేసి, ఆయన నాయకత్వంలో తెలంగాణ వారసత్వ సంపద మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.



