కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి
On
- ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
విశ్వంభర, పరిగి: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పరిగి మున్సిపాలిటీ పరిధిలోని 15వవార్డు బోయవాడ, మున్నూరు వాడలో ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అభివృద్ధికి సహకరించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిద్ధాంతి పార్థసారథి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కృష్ణ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గానేమోని శ్రీనివాస్, పాలాది శ్రీనివాస్ గుప్తా, ఆంజనేయులు, మల్లేష్, వెంకటేష్, జగన్, బాలు, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.



