ఘట్ కేసర్  ఫ్లైఓవర్ పూర్తయ్యేది ఎప్పుడు ..?

ఘట్ కేసర్  ఫ్లైఓవర్ పూర్తయ్యేది ఎప్పుడు ..?

 విశ్వంభర,  ఘట్ కేసర్: ఘట్ కేసర్ లో ఉన్న పలు రాజకీయ  పార్టీల నాయకులతో ఒరిగేది  ఏమీ లేదని ఘట్కేసర్ యువత విమర్శించారు.  12 ఏళ్లయినా  ఘట్కేసర్ రైల్వే  ఫ్లైఓవర్ పూర్తి కాకపోవడంతో  యువత ఆదివారం ఘట్కేసర్ రైల్వే గేట్ ఆవరణలో  ధర్నా నిర్వహించారు.   పలు రాజకీయ నాయకులు ఘట్కేసర్ ప్రజలు యువత సిగ్గుతో తలదించుకున్న పరిస్థితి ఏర్పడిందని  రాజకీయ నాయకులు  కాంట్రాక్ట్ ల దగ్గర మోకరిల్లి  జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు.  నాయకులు యువతకు, ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారంటూ యువత ఘాటుగా విమర్శించారు. ఈ నాయకులు పబ్బం గడుపుకోనికే  రాజకీయం చేస్తున్నారని    గత మూడేళ్లలో  ఆర్టిసి క్రాస్ రోడ్,  వరంగల్,   ఎల్బీనగర్  ఫ్లైఓవర్లు పూర్తి చేసి  ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు   పలు రాజకీయ నాయకుల వల్ల  ఘట్కేసర్ 10 ఏళ్ళు వెనుకకు  వెళ్లిందని అన్నారు. ఈ కాంట్రాక్టర్ సత్తిరెడ్డిని తప్పించి వేరే కాంట్రాక్టర్కు  ఇవ్వాలని కోరారు. ఈ నాయకులతో రైల్వే బ్రిడ్జ్  పనులు ఎప్పటికీ  పూర్తి కావని  వాళ్ల మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరని అన్నారు.  రైల్వే బ్రిడ్జి పనులు పూర్తిచేసే దమ్మున్న   రాజకీయ నాయకుడు స్థానికంగా  లేడని , రైల్వే పనులు పూర్తి కాకపోతే వచ్చే ఆదివారం ఔటర్ రింగ్ రోడ్డు చౌరస్తాలో ధర్నా నిర్వహిస్తామని తెలిపారు.

Tags: