*కవులు కళాకారులు కాదు, విద్యార్థి ఉద్యమకారులు లేకుంటే రాష్ట్రం లేదు: డాక్టర్ పిడమర్తి రవి*
విశ్వంభర, హైదరాబాద్తె :- లంగాణ రాష్ట్ర సాధనలో కవులు కళాకారుల కంటే అతి పెద్ద పాత్ర పోషించింది విద్యార్థి ఉద్యమ నాయకులు అని *అప్పటి విద్యార్థి జేఏసీ చైర్మన్,ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి* అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సమావేశం ఈరోజు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో విద్యార్థి జేఏసీ చైర్మన్ పిడమర్తి రవి గారు మాట్లాడుతూ తెలంగాణ సాధనలో కవులు కళాకారులు కంటే విద్యార్థి పాత్ర ఎక్కువగా ఉందని విద్యార్థులు లేకపోతే ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం లేదు ఇప్పుడు తెలంగాణ లేదు అని అన్నారు. ఎంతోమంది విద్యార్థి నాయకులు వీరోచిత పోరాటం ఫలితంగానే ఆనాడు రాష్ట్రం సిద్ధించిందని రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వాలు సమచిత స్థానం కల్పించలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం *తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం* మరియు ఉద్యమకారులకు ఇంటికో ఉద్యోగం, అప్పుడు ఉద్యమంలో పాల్గొన్న నాయకులంతా చాలామంది వృద్యాపం, వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నందుకు వారికి ఉద్యమకారుల కోటాలో పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యార్థి ఉద్యమ నాయకుల పైన మిగిలి ఉన్న అన్ని పోలీస్ కేసులను ఎత్తివేయాలి. *డిసెంబర్ 9న దీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు* . *కాకతీయ యూనివర్సిటీ జేఏసీ చైర్మన్ రాజేష్* మాట్లాడుతూ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకులకు రాజకీయ మరియు ప్రభుత్వంలో సమిచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో భారత రాష్ట్ర సమితికి వచ్చిన పరిస్థితి రాబోవు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఎదుర్కొంటుందని అన్నారు.
*జాగో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రాములు నేత* మాట్లాడుతూ ప్రభుత్వ భూములు ఎక్కడ ఉంటే అక్కడ తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులు ఆధీనం చేసుకొని ఇంటి నిర్మాణాలు చేపట్టాలని ఉద్యమకారులకు పిలుపునిచ్చారు. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారులకు రాష్ట్ర ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పించకపోవడం బాధాకరమని కేవలం ఒక సామాజిక వర్గానికే సమిచిత స్థానం కల్పించడం ఆలోచించాల్సిన విషయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు యాకూబ్ రెడ్డి, దామోదర్, ఫరూక్, జేకె, శ్రీనివాస్ రెడ్డి, ఓయూ నాయకులు md రహీం, హనుమంతరావు అస్మక శంకర్ సాంబశివ గౌడ్, రమణ, స్టాలిన్, ఉపేందర్, గుంటీ ప్రభాకర్, బోరెల్లి సురేష్ గణేష్ ముదిరాజ్, అంజి తదితరులు పాల్గొన్నారు.



