పులిమామిడి మమత రాజు దంపతులకు సన్మానం
On
విశ్వంభర, సదాశివపేట : సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 12వ వార్డు కౌన్సిలర్‌గా ఘన విజయం సాధించిన పులిమామిడి మమత రాజు దంపతులను వెంకటాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారికి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ మండల అధ్యక్షుడు డి. కృష్ణ, మాజీ సర్పంచ్ టి. మహేందర్, ఉపసర్పంచ్ కుమార్, నర్సింలు, ప్రేమానందం, జంజిరాల విజయ్ కుమార్, వెంకటేశం, పోచన్న, నరేందర్, పద్మారావు తదితరులు పాల్గొన్నారు.



