మీర్ పేట్ లో దోమల బెడదతో ఇబ్బంది పడుతున్న ప్రజలు ..  మహాప్రభూ మమ్ముల్ని పట్టించుకోండి.. 

మీర్ పేట్ లో దోమల బెడదతో ఇబ్బంది పడుతున్న ప్రజలు ..  మహాప్రభూ మమ్ముల్ని పట్టించుకోండి.. 

  •  రోగాల బారిన కాలనీవాసులు
  • పట్టించుకోని అధికారులు. 
  • ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు. 

విశ్వంభర, మీర్ పేట్ :- దోమలబెడదతో పలు ఇబ్బందులు ఎదుర్కుంటున్న పట్టించుకునే పాపాన పోలేదని మీర్ పేట్ లోని అయోధ్యనగర్ కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులనుండి అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన పెడచెవిన పెడుతున్నారని స్థానిక అయోధ్య నగర్ కాలనీ సెక్రటరీ , తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర సెక్రటరీ కూర రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దోమల బెడద వలన స్థానిక కాలనీలో చిన్నపిల్లలకు , వృద్దులకు , మహిళలు డెంగ్యూ , మలేరియా  రోగాల బారిన పడి తీవ్ర అస్వస్థతలకు గురవుతున్నారు. స్థానిక అధికారులు , వార్డ్ ఆఫీసర్స్ , సూపెర్వైజర్స్ ఎన్నిసార్లు చెప్పిన నిర్లక్ష్యం వహిస్తూ దురుసుగా ప్రవర్తిసున్నారని మండి పడ్డారు. మాజీ ప్రజాప్రతినిధులకు  చెప్పిన కూడా సరే అంటూ దాటవేస్తున్నారని , వెంటనే ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కారించాలని స్థానికులు కోరారు.  

Tags: