భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండండి.

ఎస్ఐ జె. జగన్

భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండండి.

విశ్వంభర,సంస్థాన్ నారాయణపురం: భారీ వర్షాల కారణంగా ప్రజల భద్రత దృష్ట్యా అవసరమైతే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరూ బయటకు రాకూడదని ఎస్ ఐ జె. జగన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.వర్షాల ప్రభావంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరే అవకాశం ఉన్నందున,చిన్నారులను,వృద్ధులను, ఒంటరిగా ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు పంపించవద్దు అని ఆయన సూచించారు.వర్షాలతో చెరువులు కుంటలు నిండి ప్రవహిస్తున్నందున ప్రజలందరూ పోలీసు వారి సూచనలతో తమ కుటుంబాల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వగలరని ఆయన మనవి చేశారు.

Tags: