సినిమా సీన్‌ను తలపించిన తమిళనాడు ఘటన.. రూ.15 వేల ఆశతో గుండు గీయించుకున్న మహిళలు
- 'విక్రమార్కుడు' సినిమా సీన్ గుర్తు చేసిన తమిళనాడు ఘటన.. గుండు చేయించుకుని మోసపోయిన మహిళలు
- సినిమాలో కామెడీ.. నిజ జీవితంలో విషాదం.. రూ.15 వేల కోసం గుండు చేయించుకున్న మహిళల
- 'విక్రమార్కుడు' తరహా మోసం.. ప్రభుత్వ పథకం పేరుతో మహిళలను బురిడీ కొట్టించిన కేటుగాడు
Tamil Nadu,: తమిళనాడులోని సేలం జిల్లాలో జరిగిన ఈ ఘటన చాలామందికి రవితేజ నటించిన 'విక్రమార్కుడు' సినిమాలోని ఓ హాస్య సన్నివేశాన్ని గుర్తు చేస్తోంది. ఆ సినిమాలో రవితేజ మాటలు నమ్మిన మహిళలు తలలో సగం గుండు గీయించుకుంటే, మిగిలిన సగం బ్రహ్మానందం గీయించే కామెడీ సన్నివేశం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. అయితే, తమిళనాడులో జరిగిన ఈ ఘటన మాత్రం నిజ జీవితంలో చోటుచేసుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
తహసీల్దార్ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామని చెప్పిన ఓ అజ్ఞాత వ్యక్తి, కొత్త వ్యాధి నుంచి రక్షణ కోసం గుండు చేయించుకుంటే ప్రభుత్వం రూ.15 వేల ఆర్థిక సాయం అందిస్తుందని ఓ మహిళను నమ్మించాడు. ఆమె ఈ విషయాన్ని మరికొంతమందికి చెప్పడంతో ముగ్గురు మహిళలు గుండు గీయించుకున్నారు. అనంతరం ఆ వ్యక్తి ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో తాము మోసపోయామని గుర్తించి బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
సినిమాల్లో మాత్రమే జరిగే ఇలాంటి ఘటనలు నిజ జీవితంలోనూ జరగడం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే, ప్రభుత్వం లేదా అధికారుల పేరుతో వచ్చే ఇలాంటి ఫోన్ కాల్స్‌ను నమ్మకుండా, ముందుగా అధికారికంగా ధృవీకరించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.