మేళ్లచెరువు పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ నరసింహ
విశ్వంభర, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ కె. నరసింహ వార్షిక తనిఖీలో భాగంగా సందర్శించి స్టేషన్ పనితీరును సమీక్షించారు. ముందుగా మేళ్లచెరువులోని ప్రసిద్ధ శివాలయాన్ని దర్శించిన ఆయన, మహాశివరాత్రి జాతర సందర్భంగా చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లపై ఆలయ అధికారులతో చర్చించారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో గౌరవ వందనం స్వీకరించిన ఎస్పీ, సిబ్బంది కవాతు, పోలీసు సామగ్రిని పరిశీలించి వారి పనితీరుపై సమీక్ష నిర్వహించారు. స్టేషన్ ఆవరణలో పోలీసు సిబ్బంది, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో కలిసి వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. వాతావరణ సమతుల్యత కోసం ప్రతి ఒక్కరూ చెట్లు పెంచాలని, విద్యార్థులు సామాజిక కార్యక్రమాల్లో ముందుండాలని పిలుపునిచ్చారు. పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులు, పెండింగ్ ఫిర్యాదులు, గత మూడేళ్ల నేరాల నమోదుపై సమీక్ష నిర్వహించిన ఎస్పీ, ప్రజా ఫిర్యాదులపై వేగంగా స్పందించి నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు మరింత చేరువగా పోలీసు సేవలు అందించేందుకు డోర్‌స్టెప్ ఎఫ్‌ఐఆర్ విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. 100 లేదా 112కు ఫోన్ చేసిన బాధితుల వద్దకే పోలీసులు వెళ్లి ఫిర్యాదు స్వీకరించి తక్షణ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మేళ్లచెరువు మండలం అంతర్రాష్ట్ర సరిహద్దుకు సమీపంలో ఉండటంతో అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు ప్రత్యేక నిఘా, రాత్రింబవళ్లు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వ్యక్తులపై కూడా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు. ఇటీవల మేళ్లచెరువు పరిధిలోని ఓ హత్య కేసులో సమర్థవంతమైన దర్యాప్తుతో నిందితులకు జీవిత ఖైదు శిక్ష పడేలా చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, సీఐ రామకృష్ణా రెడ్డి, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ మగ్దూం అలీ, స్పెషల్ బ్రాంచ్ ఎస్‌ఐ రాంబాబు, ఆర్‌ఎస్‌ఐ అశోక్, ఎస్పీ సీసీ సందీప్, డీసీఆర్‌బీ సిబ్బంది, టెక్నికల్ టీం సభ్యులు, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.