తెలుగుదేశం ప్రజాపథం నివేదికను చంద్రబాబుకు అందజేత

విశ్వంభర, అమరావతి : తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతం, రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల సన్నాహకాలలో భాగంగా నిర్వహించిన 'తెలుగుదేశం ప్రజాపథం' కార్యక్రమాల నివేదికను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి సికింద్రాబాద్ పార్లమెంట్ నాయకులు మంగళవారం ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో అందజేశారు. గత మే 17న నిర్వహించిన మినీ మహానాడు స్ఫూర్తితో సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో చేపట్టిన ప్రజాపథం కార్యక్రమాల వివరాలను పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎం. అరవింద్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో సమర్పించారు. తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేసి జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు కార్యకర్తలను సమాయత్తం చేసే లక్ష్యంతో చేపడుతున్న కార్యక్రమాలపై చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించి నాయకులకు తగిన దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం. అరవింద్ కుమార్ గౌడ్, నల్లెల కిషోర్, శ్రీపతి సతీష్ కుమార్, పోలంపల్లి అశోక్, కాసుల సుదర్శన్ రెడ్డి, తడక వినోద్, శ్యామ్ సుందర్, కరణం కిరణ్, భాను ప్రకాష్, సీహెచ్. ప్రదీప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

🕒 29 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/andhra-pradesh/telugu-desam-prajapatham-report-will-be-handed-over-to-chandrababu/article-20132

Tags:  

Advertisement

LatestNews

కదిరి కేజీబీవీలో టీచర్ నిర్వాకం.. విద్యార్థినులతో కాళ్లు పట్టించుకున్న ఘటన వైరల్
టీటీడీ పేరుతో నకిలీ వెబ్‌సైట్.. భక్తులను టార్గెట్ చేస్తున్న సైబర్ కేటుగాళ్లు
ఆగస్టు 31 వరకు ఉచిత కంటి పరీక్షలు.. అనంత‌పురంలో డా. అగర్వాల్స్ ఐ హాస్పిటల్ ప్రత్యేక ఆఫర్
సినిమా సీన్‌ను తలపించిన తమిళనాడు ఘటన.. రూ.15 వేల ఆశతో గుండు గీయించుకున్న మహిళలు
పెద్దవంగర మండలంలో  అభివృద్ధి పనులకు శ్రీకారం
అంగన్వాడీ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు త్వరలో విడుదల
మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి గుట్ట దేవస్థానం చైర్మన్‌గా తుమ్మల శ్రీనివాస్ యాదవ్