హైడ్రా రెండేళ్లు..  3,325 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాల నుంచి స్వాధీనం

విశ్వంభర, హైదరాబాదు : హైదరాబాదులో వరదల నివారణ, జలవనరుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల ఆక్రమణల నివారణ లక్ష్యంగా ఏర్పాటు చేసిన హైడ్రా రెండేళ్లలో 3,325 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాల నుంచి స్వాధీనం చేసుకుంది. దీని విలువ సుమారు రూ.1.50 లక్షల కోట్లు ఉంటుందని హైడ్రా వెల్లడించింది. హైడ్రా ఇప్పటివరకు 2,665 ఎకరాల ప్రభుత్వ భూమి, 454.11 ఎకరాల చెరువు భూమి, 25.37 ఎకరాల నాలాలు, 90.39 ఎకరాల పార్కులు, 62.18 ఎకరాల రహదారులు, ఫుట్‌పాత్‌లు, 26.31 ఎకరాల ప్రజావసరాల భూములను ఆక్రమణల నుంచి విముక్తం చేసింది. నగరంలో వరదల నివారణలో భాగంగా బతుకమ్మకుంట, నల్లచెరువు, తమ్మిడికుంట, సున్నం చెరువు, బమృకున్-ఉద్-దౌలా చెరువు సహా ఆరు చెరువులను పునరుద్ధరించింది. మరో 14 చెరువుల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. అలాగే నగరం నాలుగు దిక్కుల్లో నాలుగు పెద్ద చెరువులను మినీ ట్యాంక్‌బండ్‌లుగా అభివృద్ధి చేస్తోంది. అమీర్‌పేట, కృష్ణానగర్, ప్యాట్నీ నాలా, బాగ్‌లింగంపల్లి, మియాపూర్, ఖాజాగూడ తదితర ప్రాంతాల్లో నాలాల పూడిక తొలగింపు, ఇన్‌లెట్ల అభివృద్ధి, ఆక్రమణల తొలగింపు ద్వారా వరద ముప్పును గణనీయంగా తగ్గించినట్లు అధికారులు తెలిపారు. అమీన్పూర్, గాజుల రామారం, కొండాపూర్, పీర్జాదిగూడ, సికింద్రాబాద్ కంటోన్మెంట్, బహదూర్‌గూడ, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను కాపాడి ప్రజావసరాల కోసం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు హైడ్రా వెల్లడించింది. గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ, జలవనరుల పరిరక్షణ, పచ్చదనం పెంపు, వరదల నియంత్రణ ద్వారా సుస్థిర నగరాభివృద్ధే హైడ్రా ప్రధాన లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు.

🕒 29 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/hydra-took-over-3325-acres-of-government-land-in-two/article-20140

Tags:  

Advertisement

LatestNews

కదిరి కేజీబీవీలో టీచర్ నిర్వాకం.. విద్యార్థినులతో కాళ్లు పట్టించుకున్న ఘటన వైరల్
టీటీడీ పేరుతో నకిలీ వెబ్‌సైట్.. భక్తులను టార్గెట్ చేస్తున్న సైబర్ కేటుగాళ్లు
ఆగస్టు 31 వరకు ఉచిత కంటి పరీక్షలు.. అనంత‌పురంలో డా. అగర్వాల్స్ ఐ హాస్పిటల్ ప్రత్యేక ఆఫర్
సినిమా సీన్‌ను తలపించిన తమిళనాడు ఘటన.. రూ.15 వేల ఆశతో గుండు గీయించుకున్న మహిళలు
పెద్దవంగర మండలంలో  అభివృద్ధి పనులకు శ్రీకారం
అంగన్వాడీ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు త్వరలో విడుదల
మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి గుట్ట దేవస్థానం చైర్మన్‌గా తుమ్మల శ్రీనివాస్ యాదవ్