యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్ స్నేహ శబరిష్

విశ్వంభర, మహబూబాబాద్: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణ పనులను వేగవంతం చేసి నాణ్యతతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం గూడూరు మండలం ఎర్రకుంట తండా, బొద్దిగొండ, కురవి మండలం అయ్యగారిపల్లి గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా పాఠశాలల పనులను ఆమె పరిశీలించారు. జిల్లాలో రెండు పాఠశాలల నిర్మాణానికి ఒక్కోటి రూ.200 కోట్ల చొప్పున మొత్తం రూ.400 కోట్ల నిధులు మంజూరై పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బాలురు, బాలికలకు వేర్వేరుగా రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయడం లక్ష్యమన్నారు. ప్రతి పాఠశాలలో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు బోధనతో పాటు సుమారు 2,560 మంది విద్యార్థులకు వసతి, ఆధునిక తరగతి గదులు, సైన్స్, కంప్యూటర్ ల్యాబ్‌లు, డిజిటల్ లెర్నింగ్, గ్రంథాలయం, క్రీడా మైదానాలు, హాస్టల్, భోజనశాల వంటి సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. పేద, గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన రెసిడెన్షియల్ విద్య అందించడం, పోటీ పరీక్షలు, ఉన్నత విద్యకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ పర్యటనలో ఈడబ్ల్యూసీ ఇంజనీర్ అరుణ్ కుమార్, గూడూరు, కురవి తహసీల్దార్లు విజయ, కోమల, ఎంపీడీవో వీరబాబు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

🕒 29 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/collector-sneha-sabarish-said-construction-work-of-young-india-integrated/article-20126

Tags:  

Advertisement

LatestNews

కదిరి కేజీబీవీలో టీచర్ నిర్వాకం.. విద్యార్థినులతో కాళ్లు పట్టించుకున్న ఘటన వైరల్
టీటీడీ పేరుతో నకిలీ వెబ్‌సైట్.. భక్తులను టార్గెట్ చేస్తున్న సైబర్ కేటుగాళ్లు
ఆగస్టు 31 వరకు ఉచిత కంటి పరీక్షలు.. అనంత‌పురంలో డా. అగర్వాల్స్ ఐ హాస్పిటల్ ప్రత్యేక ఆఫర్
సినిమా సీన్‌ను తలపించిన తమిళనాడు ఘటన.. రూ.15 వేల ఆశతో గుండు గీయించుకున్న మహిళలు
పెద్దవంగర మండలంలో  అభివృద్ధి పనులకు శ్రీకారం
అంగన్వాడీ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు త్వరలో విడుదల
మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి గుట్ట దేవస్థానం చైర్మన్‌గా తుమ్మల శ్రీనివాస్ యాదవ్