నేడు జంగంమెట్‌లో గురుపౌర్ణమి వేడుకలు
విశ్వంభర, జీహెచ్‌ఎంసీ: జంగంమెట్ ఫలక్‌నుమలోని శ్రీకృష్ణ బాల భక్త సమాజం, ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం గురుపౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా సాయిబాబా దేవాలయంలో ఉదయం 5.30 గంటలకు కాకడ హారతితో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అనంతరం పంచామృతాభిషేకం, అలంకరణ, అర్చన, ధుని పూజ, మహా హారతి నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మధ్యాహ్న హారతి, 12.30 గంటలకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే రోజు ఉదయం 10 గంటలకు హనుమాన్ మందిరంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు.