అనుమతులు లేని ఆస్పత్రులు సీజ్ చేస్తాం: డీఎంహెచ్‌వో

  • తొర్రూరులో ప్రైవేట్ ఆస్పత్రులపై ఆకస్మిక తనిఖీలు

విశ్వంభర,  తొర్రూరు : జిల్లాలో అనుమతులు లేకుండా నడుస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రవి రాథోడ్ హెచ్చరించారు. హక్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అమలులో భాగంగా మంగళవారం ఆయన తొర్రూరు పట్టణంలోని పలువురు ప్రైవేట్ ఆస్పత్రులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. డాక్టర్ గణేష్ స్కాన్ అండ్ డెంటల్ హాస్పిటల్, నిర్మల్ హాస్పిటల్, సాయి మల్టీస్పెషాలిటీ హాస్పిటల్, విజయలక్ష్మి ప్రైవేట్ ఆస్పత్రులను పరిశీలించిన డీఎంహెచ్‌వో ఆస్పత్రుల రికార్డులు, లైసెన్సులు, అవసరమైన ధ్రువపత్రాలు, రోగులకు అందిస్తున్న కనీస వైద్య సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆస్పత్రుల నిర్వాహకులు, వైద్యులు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ ఆస్పత్రులను నిర్వహించాలని సూచించారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, పీసీపీఎన్‌డీటీ చట్టం నిబంధనలను ఉల్లంఘిస్తూ అనుమతులు లేకుండా ఆస్పత్రులు లేదా స్కానింగ్ సెంటర్లు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే సంబంధిత ఆస్పత్రులను సీజ్ చేస్తామని డాక్టర్ రవి రాథోడ్ స్పష్టం చేశారు. తనిఖీలలో డిప్యూటీ డెమో రాజ్‌కుమార్, రాకేష్ మనోహర్, కృష్ణ, సత్యప్రకాశ్ తదితర అధికారులు పాల్గొన్నారు.

🕒 29 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/dmho-will-seize-unlicensed-hospitals/article-20187

Tags:  

Advertisement

LatestNews

కదిరి కేజీబీవీలో టీచర్ నిర్వాకం.. విద్యార్థినులతో కాళ్లు పట్టించుకున్న ఘటన వైరల్
టీటీడీ పేరుతో నకిలీ వెబ్‌సైట్.. భక్తులను టార్గెట్ చేస్తున్న సైబర్ కేటుగాళ్లు
ఆగస్టు 31 వరకు ఉచిత కంటి పరీక్షలు.. అనంత‌పురంలో డా. అగర్వాల్స్ ఐ హాస్పిటల్ ప్రత్యేక ఆఫర్
సినిమా సీన్‌ను తలపించిన తమిళనాడు ఘటన.. రూ.15 వేల ఆశతో గుండు గీయించుకున్న మహిళలు
పెద్దవంగర మండలంలో  అభివృద్ధి పనులకు శ్రీకారం
అంగన్వాడీ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు త్వరలో విడుదల
మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి గుట్ట దేవస్థానం చైర్మన్‌గా తుమ్మల శ్రీనివాస్ యాదవ్