అంగన్వాడీ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు త్వరలో విడుదల

విశ్వంభర, హైదరాబాదు :  అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ అనుబంధ అంగన్వాడీ యూనియన్ ప్రతినిధులు మంగళవారం హైదరాబాదు ఐసీడీఎస్ జాయింట్ డైరెక్టర్ మోతీకి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో జూలై నెల వేతనాలను ఆగస్టు 1న చెల్లిస్తామని, ప్రీ-ప్రైమరీ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. రిటైర్మెంట్ బకాయిల చెల్లింపునకు ₹15 కోట్ల నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు, ఏప్రిల్, మే, జూన్ నెలల గది అద్దెలను 15 రోజుల్లో విడుదల చేస్తామని తెలిపారు. అలాగే 87 మంది మినీ అంగన్వాడీ టీచర్లకు పెండింగ్‌లో ఉన్న ఏరియర్స్, సీబీఈ ఈవెంట్స్ బిల్లులు, గ్యాస్ బిల్లులను త్వరలో విడుదల చేస్తామని పేర్కొన్నారు. హెల్పర్‌ల నుంచి టీచర్లుగా పదోన్నతి పొందిన వారికి పెండింగ్ వేతనాలు, ఏరియర్స్‌ను వెంటనే చెల్లించాలని యూనియన్ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. జయలక్ష్మి, వనపర్తి జిల్లా కార్యదర్శి కవిత, ఖమ్మం జిల్లా నాయకురాలు కోటీశ్వరి, యాదాద్రి భువనగిరి జిల్లా నాయకురాలు స్వరూపారాణి, వాలి తదితరులు పాల్గొన్నారు.

🕒 29 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/pending-dues-of-anganwadi-employees-will-be-released-soon/article-20201

Tags:  

Advertisement

LatestNews

కదిరి కేజీబీవీలో టీచర్ నిర్వాకం.. విద్యార్థినులతో కాళ్లు పట్టించుకున్న ఘటన వైరల్
టీటీడీ పేరుతో నకిలీ వెబ్‌సైట్.. భక్తులను టార్గెట్ చేస్తున్న సైబర్ కేటుగాళ్లు
ఆగస్టు 31 వరకు ఉచిత కంటి పరీక్షలు.. అనంత‌పురంలో డా. అగర్వాల్స్ ఐ హాస్పిటల్ ప్రత్యేక ఆఫర్
సినిమా సీన్‌ను తలపించిన తమిళనాడు ఘటన.. రూ.15 వేల ఆశతో గుండు గీయించుకున్న మహిళలు
పెద్దవంగర మండలంలో  అభివృద్ధి పనులకు శ్రీకారం
అంగన్వాడీ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు త్వరలో విడుదల
మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి గుట్ట దేవస్థానం చైర్మన్‌గా తుమ్మల శ్రీనివాస్ యాదవ్