స్పెషల్ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని వినతి
విశ్వంభర, హైదరాబాదు : తెలంగాణలో పనిచేస్తున్న స్పెషల్ టీచర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ స్పెషల్ టీచర్స్ అండ్ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వ పెన్షన్దారుల సంయుక్త కార్యచరణ సమితి చైర్మన్ లక్ష్మయ్యకు మంగళవారం హైదరాబాదులో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు పన్నాల గోపాల్ రెడ్డి, జనరల్ సెక్రటరీ బి కోటయ్య, కోశాధికారి పెద్దూరి పెద్దన్నలు మాట్లాడుతూ, 1983–1996 మధ్య కాలంలో పనిచేసిన స్పెషల్ టీచర్లకు న్యాయం చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్ నెం.28 ప్రకారం ఇచ్చిన ప్రయోజనాలను తెలంగాణలోనూ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఒకే ఉద్యోగానికి రెండు, మూడు సంవత్సరాల సేవను పది, ఇరవై, ముప్పై సంవత్సరాలుగా పరిగణించి ప్రయోజనాలు కల్పించిన నేపథ్యంలో, తమకూ అదే విధంగా సేవలను గుర్తించి స్పెషల్ వాలంటరీ విరమణ (ఎస్‌వీవీ)తో పాటు పెన్షన్, ఇతర పదవీ విరమణ ప్రయోజనాలు అందించాలని కోరారు. ఈ సమస్యను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, జీవో ప్రకారం తమకు న్యాయం చేయాలని సంఘం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగం గౌరవ అధ్యక్షులు ముత్తారం నరసింహస్వామి, జోగు బిక్షపతి, శ్రీనివాస్ రెడ్డి, నర్సింగరావు, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.