వైభవంగా విఠలేశ్వర స్వామి రథోత్సవం
విశ్వంభర,పెద్ద శంకరంపేట: ఆషాడ మాస ఉత్సవాలలో భాగంగా పెద్ద శంకరంపేట లో మంగళవారం శ్రీ రుక్మిణి విఠలేశ్వర స్వామి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. మహిళలు స్వామివారికి ప్రత్యేకంగా మంగళహారతులు ఇచ్చారు.ప్రత్యేకంగా అలంకరించిన రతం పై రుక్మిణి విఠలేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను ఉంచి విఠలేశ్వర స్వామి దేవాలయం నుండి పాత గ్రామపంచాయతీ కొత్త బస్టాండ్.. అంబేద్కర్ చౌరస్తా.. పాత బస్టాండ్. పట్టణ పురవీధుల గుండా రథోత్సవం నిర్వహించారు. భక్తులు భజనలు కీర్తనలు పాడుతూ ప్రధాని లాగుతూ కన్నుల పండుగగా రథోత్సవం నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా చిన్నారులు చేసిన భజనలు కీర్తనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో విఠలేశ్వర స్వామి ఆలయ భక్తులు. అధిక సంఖ్యలో ప్రజలు తదితరులు పాల్గొన్నారు.