ఉన్నత విద్యకు ఆర్థిక సహాయం అందజేసిన బూడిద రాంరెడ్డి

విశ్వంభర, ఇబ్రహీంపట్నం: అబ్దుల్లాపూర్ మెట్ మండలం, గౌరెల్లి గ్రామానికి చెందిన చిత్రం కృష్ణ  కుమార్తె చిత్రం చైతన్యక్రాంతి బి -ఫార్మసీ ఉన్నత విద్యను కొనసాగించేందుకు బీఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బూడిద రాంరెడ్డి ఆర్థిక సహాయం అందజేశారు. చైతన్యక్రాంతి బి -ఫార్మసీ చదువుతున్నది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఫీజు చెల్లింపులో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని తెలుసుకున్న బీఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బూడిద రామ్ రెడ్డి స్పందించి, ఆమె చదువుకు ఆటంకం కలగకుండా 20 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా బూడిద  రాంరెడ్డి మాట్లాడుతూ, పేద విద్యార్థుల ఉన్నత విద్యకు తోడ్పాటు అందించడమే బీఆర్ఆర్ ఫౌండేషన్ ప్రధాన లక్ష్యం. చైతన్యక్రాంతి బాగా చదివి డాక్టర్‌గా రాణించి, సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షిస్తున్నాను. చదువులో రాణించే ప్రతి విద్యార్థికి మా ఫౌండేషన్ అండగా ఉంటుంది అని అన్నారు. సహాయం అందుకున్న చిత్రం చైతన్యక్రాంతి, ఆమె తండ్రి చిత్రం కృష్ణ గారు బూడిద రాంరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు. మా లాంటి మధ్యతరగతి కుటుంబాలకు ఇలాంటి సహాయం చాలా పెద్ద అండ. ఈ సహాయం వల్ల నా చదువు కొనసాగుతుంది అని చైతన్యక్రాంతి ఆనందం వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమంలో గౌరెల్లి గ్రామస్థులు, బీఆర్ఆర్  ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

🕒 29 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/ashe-ramreddy-who-provided-financial-assistance-for-higher-education/article-20136

Tags:  

Advertisement

LatestNews

కదిరి కేజీబీవీలో టీచర్ నిర్వాకం.. విద్యార్థినులతో కాళ్లు పట్టించుకున్న ఘటన వైరల్
టీటీడీ పేరుతో నకిలీ వెబ్‌సైట్.. భక్తులను టార్గెట్ చేస్తున్న సైబర్ కేటుగాళ్లు
ఆగస్టు 31 వరకు ఉచిత కంటి పరీక్షలు.. అనంత‌పురంలో డా. అగర్వాల్స్ ఐ హాస్పిటల్ ప్రత్యేక ఆఫర్
సినిమా సీన్‌ను తలపించిన తమిళనాడు ఘటన.. రూ.15 వేల ఆశతో గుండు గీయించుకున్న మహిళలు
పెద్దవంగర మండలంలో  అభివృద్ధి పనులకు శ్రీకారం
అంగన్వాడీ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు త్వరలో విడుదల
మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి గుట్ట దేవస్థానం చైర్మన్‌గా తుమ్మల శ్రీనివాస్ యాదవ్