పెద్దవంగర మండలంలో  అభివృద్ధి పనులకు శ్రీకారం

  • శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి

విశ్వంభర,పెద్దవంగర : పెద్దవంగర మండలంలోని పలు గ్రామాల్లో గ్రామాభివృద్ధి పనులకు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశశ్విని రెడ్డి మంగళవారం శ్రీకారం చుట్టారు. ఎల్‌బీ తండా, గంట్లకుంట, ఉప్పరిగూడెం, కొరిపెల్లి గ్రామాల్లో  లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు భూమిపూజ చేసి శంకుస్థాపనలు చేశారు. ముందుగా ఎల్‌బీ తండాలో అంగన్‌వాడీ భవన నిర్మాణంతో పాటు సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. అనంతరం అంగన్‌వాడీ చిన్నారులకు యూనిఫాంలు పంపిణీ చేసి వారితో ముచ్చటించారు. చిన్నారుల ఆరోగ్యం, విద్య, పోషకాహారంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని, నాణ్యమైన వసతులు కల్పించడం ద్వారా వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. గంట్లకుంట గ్రామంలో రూ.9 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఉప్పరిగూడెంలో రూ.27 లక్షలతో సీసీ రోడ్డు, రూ.10 లక్షలతో మహిళా సమైక్య భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. కొరిపెల్లి గ్రామంలో రూ.27 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... గ్రామాల సమగ్రాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రతి గ్రామంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పిస్తూ జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో ఆయా గ్రామాల సర్పంచ్‌లు పరమేష్, యకలక్ష్మి సోమన్న, దుంపల శ్రీదేవి-శ్యామ్, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, అంగన్‌వాడీ సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత, రైతులు, తల్లిదండ్రులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

🕒 29 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/initiation-of-development-works-in-peddawangara-mandal/article-20203

Tags:  

Advertisement

LatestNews

కదిరి కేజీబీవీలో టీచర్ నిర్వాకం.. విద్యార్థినులతో కాళ్లు పట్టించుకున్న ఘటన వైరల్
టీటీడీ పేరుతో నకిలీ వెబ్‌సైట్.. భక్తులను టార్గెట్ చేస్తున్న సైబర్ కేటుగాళ్లు
ఆగస్టు 31 వరకు ఉచిత కంటి పరీక్షలు.. అనంత‌పురంలో డా. అగర్వాల్స్ ఐ హాస్పిటల్ ప్రత్యేక ఆఫర్
సినిమా సీన్‌ను తలపించిన తమిళనాడు ఘటన.. రూ.15 వేల ఆశతో గుండు గీయించుకున్న మహిళలు
పెద్దవంగర మండలంలో  అభివృద్ధి పనులకు శ్రీకారం
అంగన్వాడీ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు త్వరలో విడుదల
మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి గుట్ట దేవస్థానం చైర్మన్‌గా తుమ్మల శ్రీనివాస్ యాదవ్