రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలి 

రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలి 

  •  జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ 

 విశ్వంభర, సూర్యాపేట: మంగళవారం కోదాడ రైతు వేదిక లో ఎ ల్ నినో ప్రభావం పై కలెక్టర్ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ కొంతమంది రైతులు ఇదివరకే పత్తి, కంది, పెసర, బొబర్ల వంటి పంటలు సాగు చేయడం జరిగిందని, అలాంటి పంటల్లో అంతర పంటలు వేసుకోవాలని, తద్వారా పంటల సాగు ఖర్చు తగ్గుతుందని  తెలిపారు. అల్పపీడనద్రోణి వల్ల సెప్టెంబర్ మాసంలో   కూడ వర్షాలు వచ్చే అవకాశం లేదని, అంతేకాక ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర లలో కూడా వర్షాలు లేనందున,  ప్రాజెక్టులు కూడా  నిండే పరిస్థితి లేదని, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని  వాస్తవ పరిస్థితులను గమనించి ఆరు తడి పంటలు వేసుకోవాలని చెప్పారు.  ఇదివరకే పత్తి, కంది, పెసర,  బొబర పంటలు వేసుకున్న వారు  అంతర పంటలు  వేసుకోవచ్చని సూచించారు. వీటితోపాటు, ఉద్యాన పంటలు, కూరగాయల సాగు చేయవచ్చని, ప్రభుత్వం సబ్సిడీపై బిందు పరికరాలను అందజేస్తుందని తెలిపారు. రైతులు ఆరుతడి పంటల కింద సబ్జ, కొర్రలు, సామలు వంటి పంటలను సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మార్కెటింగ్ సదుపాయాలు కల్పించే ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా బోర్లు ,ఎత్తిపోతల పథకాల కింద, అలాగే సాధారణ వ్యవసాయం ఎలా చేయాలో కూడా వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు తెలియజేస్తారని చెప్పారు.అంతేకాక ఆయిల్ ఫామ్ వల్ల స్థిరమైన ఆదాయం వస్తుందని, ఆయిల్ పామ్ తోటలు సాగుకు పురుగుల బెడద, ఎల్ నీ నో , కోతుల బెడద వంటివి ఉండవని అన్నారు .రైతు నేస్తం ద్వారా అందించే వ్యవసాయ యాంత్రీకరణ, పద్ధతులు తెలుసుకుంటూ వ్యవసాయం సాగు చేస్తే త్వరగా వ్యవసాయం ముందుకు వెళుతుందని, రైతులు కష్టాల భారం నుండి తప్పించుకోవచ్చని కలెక్టర్ అన్నారు.  ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మున్సిపల్ చైర్మన్ కుసుమ, ఆర్డిఓ సూర్య నారాయణ, తహసిల్దార్ సంతోష్ కిరణ్, ఎంపీడీవో ఇస్సాకు హుస్సేన్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

🕒 29 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/farmers-should-grow-dry-crops/article-20195

Tags:  

Advertisement

LatestNews

కదిరి కేజీబీవీలో టీచర్ నిర్వాకం.. విద్యార్థినులతో కాళ్లు పట్టించుకున్న ఘటన వైరల్
టీటీడీ పేరుతో నకిలీ వెబ్‌సైట్.. భక్తులను టార్గెట్ చేస్తున్న సైబర్ కేటుగాళ్లు
ఆగస్టు 31 వరకు ఉచిత కంటి పరీక్షలు.. అనంత‌పురంలో డా. అగర్వాల్స్ ఐ హాస్పిటల్ ప్రత్యేక ఆఫర్
సినిమా సీన్‌ను తలపించిన తమిళనాడు ఘటన.. రూ.15 వేల ఆశతో గుండు గీయించుకున్న మహిళలు
పెద్దవంగర మండలంలో  అభివృద్ధి పనులకు శ్రీకారం
అంగన్వాడీ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు త్వరలో విడుదల
మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి గుట్ట దేవస్థానం చైర్మన్‌గా తుమ్మల శ్రీనివాస్ యాదవ్