పెన్ పహాడ్  తాసిల్దార్ కార్యాలయం ఆకస్మిక తనిఖీ 

 విశ్వంభర, సూర్యాపేట:   పెన్ పహాడ్  తాసిల్దార్ కార్యాలయాన్ని జిల్లా అదనపు కలెక్టర్ బి హరి సింగ్  మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా ఎస్ ఐ ఆర్ ఫారాలు పూర్తిచేసిన తదుపరి డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించి పలు సూచనలు చేశారు .డిజిటలైజేషన్ ప్రక్రియను సమర్థవంతంగా ఎలాంటి తప్పులు లేకుండా నిర్ణీత గడువులోగా ఎంట్రీ చేయాలని ఆదేశించారు. అనంతరం తాసిల్దార్, బి ఎల్ వో లు, సూపర్వైజర్లతో   స్టాప్ మీటింగ్ నిర్వహించి, మండల పరిషత్ కార్యాలయంలో ఏల్ నీ నో  ప్రభావం పై  అవగాహన సదస్సుకు హాజరైనారు. ఈ సదస్సులో అదనపు కలెక్టర్ బి హరి సింగ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎల్ నీ నో ప్రభావం వల్ల   వర్షపాతం తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు సూచించినందున రైతులు నీటి అవసరం తక్కువగా ఉన్న పంటలు వేయాలని వరి లాంటి నీటి అవసరం ఎక్కువ ఉన్న పంటలకు బదులుగా ఆరుతడి పంటలైన సజ్జలు, జొన్నలు, కంది, పెసర, మినుము, కూరగాయలు వంటి పంటలు పండించాలని  నీటిని జాగ్రత్తగా వాడాలని అవసరమైతే డ్రిప్, స్ప్రింక్లర్ లాంటి సూక్ష్మ నీటి పారుదల పద్ధతులు అవలంబించాలని అన్నారు. వ్యవసాయ శాఖ సూచనలు పాటిస్తూ రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల వైపు అడుగులు వేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ రాజశేఖర్, ఎంపీడీవో ఎ జానయ్య, ఆర్ ఐ రంజిత్ రెడ్డి, అజీజ్ ఉన్నిసా, మండల అధికారులు, సర్పంచులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

🕒 29 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/pen-pahad-%C2%A0tahsildar-office-surprise-inspection/article-20183

Tags:  

Advertisement

LatestNews

కదిరి కేజీబీవీలో టీచర్ నిర్వాకం.. విద్యార్థినులతో కాళ్లు పట్టించుకున్న ఘటన వైరల్
టీటీడీ పేరుతో నకిలీ వెబ్‌సైట్.. భక్తులను టార్గెట్ చేస్తున్న సైబర్ కేటుగాళ్లు
ఆగస్టు 31 వరకు ఉచిత కంటి పరీక్షలు.. అనంత‌పురంలో డా. అగర్వాల్స్ ఐ హాస్పిటల్ ప్రత్యేక ఆఫర్
సినిమా సీన్‌ను తలపించిన తమిళనాడు ఘటన.. రూ.15 వేల ఆశతో గుండు గీయించుకున్న మహిళలు
పెద్దవంగర మండలంలో  అభివృద్ధి పనులకు శ్రీకారం
అంగన్వాడీ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు త్వరలో విడుదల
మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి గుట్ట దేవస్థానం చైర్మన్‌గా తుమ్మల శ్రీనివాస్ యాదవ్