కరాటే జాతీయ పోటీలకు జివిఆర్ అకాడమీ విద్యార్థులు

విశ్వంభర, నారాయణగూడ: బెంగళూరులో ఆగస్టు 2న జరిగే 14వ షోటోఖాన్ జాతీయ కరాటే పోటీలకు తెలంగాణ నుంచి హైదరాబాదు నారాయణగూడలోని జివిఆర్ కరాటే అకాడమీకి చెందిన 24 మంది విద్యార్థులు ఎంపికైనట్లు అకాడమీ డైరెక్టర్ డాక్టర్ జి.ఎస్. గోపాల్ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా హిమాయత్‌నగర్ మాజీ కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్న గౌడ్ ఎంపికైన విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, ముఖ్యంగా బాలికలు ఆత్మరక్షణ విద్యలు నేర్చుకోవడం నేటి పరిస్థితుల్లో అవసరమని ఆమె అన్నారు. జాతీయ స్థాయిలో తెలంగాణకు పతకాలు సాధించి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో: డాక్టర్ కిషోర్ కృష్ణారెడ్డి, అమృత రెడ్డి, ఘన సంతోషనీ రెడ్డి, సుధాకర్, అనగ, అవిజ్ఞ వెంక రెడ్డి, ద్వైత, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

🕒 29 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/gvr-academy-students-for-karate-national-competitions/article-20160

Tags:  

Advertisement

LatestNews

కదిరి కేజీబీవీలో టీచర్ నిర్వాకం.. విద్యార్థినులతో కాళ్లు పట్టించుకున్న ఘటన వైరల్
టీటీడీ పేరుతో నకిలీ వెబ్‌సైట్.. భక్తులను టార్గెట్ చేస్తున్న సైబర్ కేటుగాళ్లు
ఆగస్టు 31 వరకు ఉచిత కంటి పరీక్షలు.. అనంత‌పురంలో డా. అగర్వాల్స్ ఐ హాస్పిటల్ ప్రత్యేక ఆఫర్
సినిమా సీన్‌ను తలపించిన తమిళనాడు ఘటన.. రూ.15 వేల ఆశతో గుండు గీయించుకున్న మహిళలు
పెద్దవంగర మండలంలో  అభివృద్ధి పనులకు శ్రీకారం
అంగన్వాడీ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు త్వరలో విడుదల
మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి గుట్ట దేవస్థానం చైర్మన్‌గా తుమ్మల శ్రీనివాస్ యాదవ్