క్యాన్సర్ చికిత్సలో అత్యాధునిక విప్లవం: డాక్టర్ స్రవంతి

విశ్వంభర, నాగర్‌కర్నూల్: క్యాన్సర్ చికిత్సలో అత్యాధునిక వైద్య సాంకేతికత అందుబాటులోకి రావడంతో రోగులు భయపడాల్సిన అవసరం లేదని సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్ ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ స్రవంతి తెలిపారు. ముఖ్యంగా సరికొత్త 'హైపర్‌సైట్' రేడియేషన్ సాంకేతికతతో సైడ్ ఎఫెక్ట్స్‌ను గణనీయంగా తగ్గిస్తూ మరింత సురక్షితంగా చికిత్స అందించవచ్చని వెల్లడించారు. రేడియేషన్ థెరపీలో అడాప్టివ్ థెరపీ వినియోగంతో అనవసరమైన కణజాలంపై రేడియేషన్ ప్రభావం పడకుండా నివారించడంతో పాటు సుమారు 40 శాతం వరకు సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయని తెలిపారురోగి శ్వాసను నియంత్రిస్తూ అత్యంత కచ్చితత్వంతో చికిత్స అందించడం వల్ల ఆరోగ్యకరమైన అవయవాలకు నష్టం జరగదని, చికిత్స సమయం కూడా తగ్గి రోగులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని వివరించారు. ప్రస్తుతం జీవనశైలిలో మార్పుల కారణంగా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని డాక్టర్ స్రవంతి పేర్కొన్నారు. పురుషుల్లో ధూమపానం వల్ల ఊపిరితిత్తులు, శ్వాసనాళ క్యాన్సర్లు అధికంగా వస్తుండగా, మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ఎక్కువగా నమోదవుతోందన్నారు. రొమ్ము క్యాన్సర్ కేసుల్లో సుమారు 10 శాతం మాత్రమే జన్యుపరమైనవి కాగా, మిగిలినవి జీవనశైలి, స్థూలకాయం వంటి కారణాలతో వస్తున్నాయని చెప్పారు. 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాలని, ముందస్తుగా వ్యాధిని గుర్తిస్తే పూర్తిస్థాయిలో నయం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని డాక్టర్ స్రవంతి సూచించారు.

🕒 29 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/dr-sravanti-is-the-cutting-edge-revolution-in-cancer-treatment/article-20162

Tags:  

Advertisement

LatestNews

కదిరి కేజీబీవీలో టీచర్ నిర్వాకం.. విద్యార్థినులతో కాళ్లు పట్టించుకున్న ఘటన వైరల్
టీటీడీ పేరుతో నకిలీ వెబ్‌సైట్.. భక్తులను టార్గెట్ చేస్తున్న సైబర్ కేటుగాళ్లు
ఆగస్టు 31 వరకు ఉచిత కంటి పరీక్షలు.. అనంత‌పురంలో డా. అగర్వాల్స్ ఐ హాస్పిటల్ ప్రత్యేక ఆఫర్
సినిమా సీన్‌ను తలపించిన తమిళనాడు ఘటన.. రూ.15 వేల ఆశతో గుండు గీయించుకున్న మహిళలు
పెద్దవంగర మండలంలో  అభివృద్ధి పనులకు శ్రీకారం
అంగన్వాడీ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు త్వరలో విడుదల
మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి గుట్ట దేవస్థానం చైర్మన్‌గా తుమ్మల శ్రీనివాస్ యాదవ్