79 ఏళ్లైనా వాడి గ్రామానికి రోడ్డు లేదు: రాజు

విశ్వంభర, పెద్ద శంకరంపేట: కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని వాడి గ్రామ ప్రజలు నేటికీ కనీస రహదారి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్  అభ్యర్థి రాజు ఆరోపించారు. స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలు గడిచినా గ్రామానికి రోడ్డు నిర్మాణం జరగకపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో నాయకులు రోడ్డు, వంతెన నిర్మిస్తామని హామీలు ఇచ్చి, గెలిచిన తర్వాత గ్రామాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వమే రాష్ట్రంలో అధికారంలో ఉండగా, కాంగ్రెస్‌కు చెందిన జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు ఎన్నికల ముందు గ్రామాన్ని సందర్శించి రోడ్డు, వంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చారని, అయితే రెండున్నర సంవత్సరాలు గడిచినా ఎలాంటి పురోగతి కనిపించడం లేదని పేర్కొన్నారు. అనారోగ్యానికి గురైన వారిని ఇప్పటికీ ఎడ్లబండ్లలో తరలించాల్సిన పరిస్థితి నెలకొన్నదని, వాడి గ్రామంలో నెలకొన్న రహదారి సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని రాజు డిమాండ్ చేశారు.

🕒 29 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/even-for-79-years-the-village-of-wadi-has-no/article-20193

Tags:  

Advertisement

LatestNews

కదిరి కేజీబీవీలో టీచర్ నిర్వాకం.. విద్యార్థినులతో కాళ్లు పట్టించుకున్న ఘటన వైరల్
టీటీడీ పేరుతో నకిలీ వెబ్‌సైట్.. భక్తులను టార్గెట్ చేస్తున్న సైబర్ కేటుగాళ్లు
ఆగస్టు 31 వరకు ఉచిత కంటి పరీక్షలు.. అనంత‌పురంలో డా. అగర్వాల్స్ ఐ హాస్పిటల్ ప్రత్యేక ఆఫర్
సినిమా సీన్‌ను తలపించిన తమిళనాడు ఘటన.. రూ.15 వేల ఆశతో గుండు గీయించుకున్న మహిళలు
పెద్దవంగర మండలంలో  అభివృద్ధి పనులకు శ్రీకారం
అంగన్వాడీ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు త్వరలో విడుదల
మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి గుట్ట దేవస్థానం చైర్మన్‌గా తుమ్మల శ్రీనివాస్ యాదవ్