ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్ గా సంజీవరెడ్డి 

 విశ్వంభర,పెద్ద శంకరంపేట:  తెలంగాణ రాష్ట్ర హామీల కమిటీ ఛైర్మన్‌గా నియమితులైన నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు . ఈ కార్యక్రమం హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర శాసనసభ (అసెంబ్లీ) ప్రాంగణంలో   ఆర్భాటంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్  గడ్డం ప్రసాద్ కుమార్ , రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు  శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు  ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ సంజీవరెడ్డి కి వారు పుష్పగుచ్ఛం అందజేసి, మిఠాయిలు తినిపించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి గారు మాట్లాడుతూ, తనపై నమ్మకంతో హామీల కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ అధిష్టానానికి, స్పీకర్ కు సహకరించిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలును వేగవంతం చేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి, సంక్షేమానికి ఈ కమిటీ ద్వారా శాయశక్తులా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు,నారాయణఖేడ్ నియోజకవర్గ ముఖ్య నాయకులు  అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యే కు అభినందనలు తెలిపారు.

🕒 29 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/sanjeeva-reddy-as-the-chairman-of-the-government-guarantees-committee/article-20114

Tags:  

Advertisement

LatestNews

కదిరి కేజీబీవీలో టీచర్ నిర్వాకం.. విద్యార్థినులతో కాళ్లు పట్టించుకున్న ఘటన వైరల్
టీటీడీ పేరుతో నకిలీ వెబ్‌సైట్.. భక్తులను టార్గెట్ చేస్తున్న సైబర్ కేటుగాళ్లు
ఆగస్టు 31 వరకు ఉచిత కంటి పరీక్షలు.. అనంత‌పురంలో డా. అగర్వాల్స్ ఐ హాస్పిటల్ ప్రత్యేక ఆఫర్
సినిమా సీన్‌ను తలపించిన తమిళనాడు ఘటన.. రూ.15 వేల ఆశతో గుండు గీయించుకున్న మహిళలు
పెద్దవంగర మండలంలో  అభివృద్ధి పనులకు శ్రీకారం
అంగన్వాడీ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు త్వరలో విడుదల
మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి గుట్ట దేవస్థానం చైర్మన్‌గా తుమ్మల శ్రీనివాస్ యాదవ్