పాడి పరిశ్రమను అభివృద్ధి చేసుకోవాలి: జెడి డాక్టర్ రమేష్

విశ్వంభర, డిండి: ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గుతున్న నేపథ్యంలో రైతులు పాడి పరిశ్రమపై దృష్టి సారించి ఆర్థికంగా బలోపేతం కావాలని నల్లగొండ జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ పిలుపునిచ్చారు. దేవరకొండ నియోజకవర్గంలోని డిండి మండలం గోనకొల్లు గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పాడి పశువులకు నాణ్యమైన మేత అందించడంతో పాటు ఆడ దూడల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గడ్డి విత్తనాలు, పశుగ్రాసం తదితరాలను ప్రభుత్వం 75 శాతం సబ్సిడీతో అందిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా పాడి పరిశ్రమను అభివృద్ధి చేసుకొని పాల ఉత్పత్తి పెంచాలని రైతులకు సూచించారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ డాక్టర్ వంగాల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు పాడి పరిశ్రమను ఆదాయ వనరుగా మలచుకోవాలని అన్నారు. దేవరకొండ నియోజకవర్గంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రజాప్రతినిధుల సహకారం తీసుకుని కృషి చేస్తానని తెలిపారు. జెర్సీ ఆవులు, గేదెల పెంపకాన్ని ప్రోత్సహించి పాల ఉత్పత్తిని పెంచాలని సూచించారు. కార్యక్రమంలో పశువైద్యాధికారులు డాక్టర్ ధనలక్ష్మి, డాక్టర్ నాగయ్య రైతులకు పాడి పశువుల సంరక్షణపై అవగాహన కల్పించారు. గోనకొల్లు గ్రామానికి చెందిన పాడి రైతు లోకసాని వెంకటరెడ్డి తన అనుభవాలను రైతులతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో గోనకొల్లు సర్పంచ్ కోసిరెడ్డి రాజేందర్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, సుమారు 50 మంది పాడి రైతులు పాల్గొన్నారు.

🕒 29 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/jd-dr-ramesh-should-develop-the-dairy-industry/article-20191

Tags:  

Advertisement

LatestNews

కదిరి కేజీబీవీలో టీచర్ నిర్వాకం.. విద్యార్థినులతో కాళ్లు పట్టించుకున్న ఘటన వైరల్
టీటీడీ పేరుతో నకిలీ వెబ్‌సైట్.. భక్తులను టార్గెట్ చేస్తున్న సైబర్ కేటుగాళ్లు
ఆగస్టు 31 వరకు ఉచిత కంటి పరీక్షలు.. అనంత‌పురంలో డా. అగర్వాల్స్ ఐ హాస్పిటల్ ప్రత్యేక ఆఫర్
సినిమా సీన్‌ను తలపించిన తమిళనాడు ఘటన.. రూ.15 వేల ఆశతో గుండు గీయించుకున్న మహిళలు
పెద్దవంగర మండలంలో  అభివృద్ధి పనులకు శ్రీకారం
అంగన్వాడీ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు త్వరలో విడుదల
మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి గుట్ట దేవస్థానం చైర్మన్‌గా తుమ్మల శ్రీనివాస్ యాదవ్