ఆగస్టు 10న ఛలో ఢిల్లీ
విశ్వంభర, బషీర్ బాగ్ : వర్గీకరణలో మాలలకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ఆగస్టు 10న జంతర్ మంతర్ లో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మాలలు తరలిరావాలని రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్ గౌరవాధ్యక్షుడు చెరుకు రామ్ చందర్ లు పిలుపునిచ్చారు. మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం దళితులను వర్గీకరించి మాలలకు తీవ్ర అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు శాతం పేదరికం ఉన్న అగ్రకులాలకు ఈడబ్ల్యూఎస్ పేరుతో 10 శాతం రిజర్వేషన్ కల్పించిన ప్రభుత్వాలు మాలలను మరవడం సిగ్గుచేటన్నారు. దళితులను జనాభా ప్రాతిపదికన విడగొట్టడంతో ఎస్సీల్లోని 58 కులాలు రిజర్వేషన్లను కోల్పోతున్నాయని ఆవేదన చెందారు. రోస్టర్ పాయింట్ల కారణంగా మాలలకు వెయ్యి ఉద్యోగాల్లో 28 ఉద్యోగాలు వస్తున్నాయని 50 లోపు ఉంటే ఒకటి రావడం లేదని గుర్తు చేశారు. రేవంత్ గద్దె దిగితే గాని మాలలకు న్యాయం జరగదని అన్నారు. మంత్రి వివేక్ రాజీనామాను స్వాగతిస్తున్నామని ఇదే బాటలో డిప్యూటీ సీఎం స్పీకర్ ఎమ్మెల్సీ ఇతర మాల ఎమ్మెల్యే ఎంపీలు కూడా వివేక్ ను అనుసరించాలని సూచించారు. జంతర్ మంతర్ లు ధర్నా నిర్వహించిన అనంతరం ఢిల్లీలోని అన్ని పార్టీల అధ్యక్షులను, సోనియా రాహుల్ గాంధీ లను సైతం కలవనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా చలో ఢిల్లీ పోస్టర్ కరపత్రాలను నేతలు ఆవిష్కరించారు. ఈ సమావేశంలో వర్కింగ్ చైర్మన్ మంత్రి నరసింహయ్య, జిహెచ్ఎంసి చైర్మన్ బేర బాలకిషన్, వైస్ చైర్మన్లు గంగాధర్, శ్రీనివాస్, ప్రణయ్, మాల స్టూడెంట్ జేఏసీ చైర్మన్ మాదాసు రాహుల్ ,భాను తేజ, బత్తుల రమేష్, బత్తుల దిలీప్, నాగేశ్వరరావు, గోపాల్, రాములు, శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.