ఎమ్మెల్యేకు కీలక పదవి దక్కడం నారాయణఖేడ్ కే గర్వకారణం
విశ్వాంభర, పెద్ద శంకరంపేట: నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి కి ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్ బాధ్యత దక్కడం నారాయణఖేడ్ నియోజకవర్గానికి గర్వకారణమని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు సమర్థవంతంగా అమలయ్యేలా ప్రభుత్వం తరఫున బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తారని వారు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి నారాయణఖేడ్ నియోజకవర్గంలోని వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, సర్పంచులు, ఉపసర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, మాజీ ఎంపీటీసీలు,మాజీ జెడ్పీటీసీలు, యూత్ కాంగ్రెస్ నాయకులు,పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు , అభిమానులు పెద్ద ఎత్తున హాజరై డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి కి ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి కి రాష్ట్ర స్థాయిలో లభించిన ఈ బాధ్యత నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి మరింత దోహదపడుతుందని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన మరింత కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఉత్సాహభరిత నినాదాలు, అభినందనల మధ్య అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలు ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి కి అభినందనలు తెలియజేశారు.