అంగరంగ వైభవంగా శ్రీ ఎల్లమ్మ తల్లి కళ్యాణ వేడుకలు
విశ్వంభర, బోడుప్పల్: మల్కాజ్గిరి మున్సిపల్ బోడుప్పల్ సర్కిల్ లోని టెలిఫోన్ కాలనీలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ 9వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక చైర్మన్ సామల బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో ఆలయ వార్షికోత్సవంలో భాగంగా శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణం వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, ముఖ్యులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సామల బుచ్చిరెడ్డి మాట్లాడుతూ గత తొమ్మిది సంవత్సరాలుగా అమ్మవారికి వార్షికోత్సవాలు , కళ్యాణం నిర్వహిస్తున్నామని ప్రతి ఏటా లాగే ఈ సంవత్సరం కూడా కళ్యాణం ఘనంగా జరిగిందని, ఈ పండగ మూడు రోజులుగా జరుగుతోందని పుట్టపూజ, ఘటం కార్యక్రమం, అమ్మవారి కళ్యాణం వంటి కార్యక్రమాలను నిర్వహించామని, అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఆషాడ మాసంలో అమ్మవారి పూజ జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. బోడుప్పల్ ప్రజలు అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో విలసిల్లాలని ఆ అమ్మవారిని కోరుకున్నామని అన్నారు. అమ్మవారి కళ్యాణం లో ప్రజలందరూ పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రులు అయ్యారని, వార్షికోత్సవానికి సహకరించిన టెలిఫోన్ కాలనీ అసోసియేషన్ మెంబర్లకు, కాలనీ వాసులకు, మహిళలకు, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.