యువత ఆశయాలకు అండగా ఏఐవైఎఫ్
- యువశక్తితో ప్రజా ఉద్యమాలకు సిద్ధం
- ఏఐవైఎఫ్ మహాసభలో నాయకుల పిలుపు
విశ్వంభర, హుస్నాబాద్ : యువత భవిష్యత్తును దెబ్బతీస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై యువత ఐక్యంగా ఉద్యమించాలని అఖిల భారత యువజన సమాఖ్య మాజీ రాష్ట్ర నాయకులు, సీపీఐ హుస్నాబాద్ నియోజకవర్గ కన్వీనర్ జాగీర్ సత్యనారాయణ పిలుపునిచ్చారు. హుస్నాబాద్ పట్టణంలోని సీపీఐ కార్యాల యం అనబేరి సింగిరెడ్డి అమరుల భవన్ లో హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల ఏఐవైఎఫ్ మహాసభ జిల్లా నాయకుడు బిచ్చాల శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జాగీర్ సత్యనారాయణ మాట్లాడుతూ నిరుద్యోగం, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో జాప్యం,కాంట్రాక్టు,ఔట్ సోర్సింగ్ విధానాలు, పరిశ్రమల కొరత, నైపుణ్యాభివృద్ధి అవకాశాల లేకపోవడం, ప్రభుత్వ విద్య,వైద్య రంగాల నిర్లక్ష్యం వంటి సమస్యలతో యువత తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్నారు. ప్రజల పన్నులతో నడవాల్సిన ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేసి కార్పొరేట్ ప్రయోజనాల కోసం యువత జీవితాలతో చెలగాటమాడుతున్న పాలకులను ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి అంటే కేవలం ప్రకటనలు కాదని, శాశ్వత ఉద్యోగాల కల్పనతోనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి గడిపే మల్లేష్ మాట్లాడుతూ నీట్ పరీక్షల నిర్వహణలో పారదర్శకత, విద్యార్థులకు న్యాయం, విద్యా వ్యవస్థ పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా జరిగిన విద్యార్థి–యువజన ఉద్యమాలు కేంద్ర ప్రభుత్వాన్ని స్పందించేలా చేశాయన్నారు. విద్య, వైద్యాన్ని కార్పొరేట్ లాభాల సాధనంగా కాకుండా రాజ్యాంగబద్ధమైన హక్కులుగా పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు జనగాం రాజ్‌కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రైవేటీకరణ, కార్మిక వ్యతిరేక విధానాలు, విద్య–ఉపాధి రంగాలపై పెరుగుతున్న కార్పొరేట్ ఆధిపత్యం యువత ఆశయాలను దెబ్బతీస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను త్వరితగతిన అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్య, ఉపాధి, సామాజిక న్యాయం కోసం యువతను ఐక్యం చేసి ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ సభలో మేడవేణి చిరంజీవి, జాగిరి సాయికృష్ణ, భూక్యా గణేష్, దొంతరబోయిన రజిత, ఎండీ అన్వర్, అభిలాష్, మహేందర్, చరణ్, మొరే సాత్విక్, రాజేష్, అంతడుపుల సాకేత్, అభిరామ్,మండలాలకు చెందిన కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.