కదిరి కేజీబీవీలో టీచర్ నిర్వాకం.. విద్యార్థినులతో కాళ్లు పట్టించుకున్న ఘటన వైరల్
- శ్రీసత్యసాయి జిల్లాలో కలకలం.. విద్యార్థినులతో మసాజ్ చేయించుకున్న టీచర్.
- కేజీబీవీ టీచర్ ప్రవర్తనపై ఆగ్రహం.. వైరల్ వీడియోతో విచారణకు డిమాండ్
Sri Sathya Sai District: శ్రీసత్యసాయి జిల్లా నంబుళపూలకుంట మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV)లో ఓ టీచర్ ప్రవర్తన వివాదాస్పదంగా మారింది. టీచర్ రూపా విద్యార్థినులతో మసాజ్ చేయించుకోవడం, కాళ్లు పట్టించుకోవడం వంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటన కలకలం రేపుతోంది.
వైరల్ అవుతున్న వీడియోలపై తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థినులతో ఇలాంటి వ్యక్తిగత పనులు చేయించుకోవడం సరికాదని, ఘటనపై సంబంధిత విద్యాశాఖ అధికారులు సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు స్పందించి పూర్తి స్థాయి విచారణ నిర్వహించి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ఘటనపై సంబంధిత పాఠశాల యాజమాన్యం లేదా విద్యాశాఖ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.