పెన్షనర్ల సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం: జేఏసీ హెచ్చరిక

విశ్వంభర, బాగ్ లింగంపల్లి: పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం (డీఏ), పెన్షన్ బకాయిలు వెంటనే విడుదల చేసి, పెన్షనర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వ పెన్షన్‌దారుల సంయుక్త కార్యాచరణ సమితి (జేఏసీ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సమస్యల పరిష్కారంలో జాప్యం కొనసాగితే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించింది. మంగళవారం హైదరాబాదు బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన జేఏసీ రాష్ట్ర సదస్సులో చైర్మన్ కె. లక్ష్మయ్య మాట్లాడుతూ, 2026 జనవరి 1 నుంచి 6 శాతం డీఏను అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అదనపు పెన్షన్ అమలు చేయడంతో పాటు ఈహెచ్‌ఎస్ కింద కొత్త ఆరోగ్య కార్డులు జారీ చేసి నగదు రహిత వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. అన్ని ప్రభుత్వ పెన్షనర్లను ఆరోగ్య పథకంలో చేర్చాలని, కమ్యూటేషన్ పునరుద్ధరణ కాలాన్ని తగ్గించాలని, పెన్షనర్ల కోసం ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు చేసి గుర్తింపు కార్డులు జారీ చేయాలని కోరారు. అలాగే నిలిచిపోయిన వైద్య సేవలను పునరుద్ధరించి, 2024 తర్వాత పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు కూడా పెన్షన్ సవరణలు, ఇతర ప్రయోజనాలు కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో  జేఏసీ ప్రధాన కార్యదర్శి తులసి సత్యనారాయణ, కోశాధికారి బి.ఎన్.వి.వి. కృష్ణ ప్రసాద్, కో-చైర్మన్ పుల్లయ్య, డి. సుధాకర్, ఏ. రాజేంద్రబాబు, జి. మారయ్య, టి. సుధాకర్, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

🕒 29 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/movement-jac-warns-if-problems-of-pensioners-are-not-resolved/article-20166

Tags:  

Advertisement

LatestNews

కదిరి కేజీబీవీలో టీచర్ నిర్వాకం.. విద్యార్థినులతో కాళ్లు పట్టించుకున్న ఘటన వైరల్
టీటీడీ పేరుతో నకిలీ వెబ్‌సైట్.. భక్తులను టార్గెట్ చేస్తున్న సైబర్ కేటుగాళ్లు
ఆగస్టు 31 వరకు ఉచిత కంటి పరీక్షలు.. అనంత‌పురంలో డా. అగర్వాల్స్ ఐ హాస్పిటల్ ప్రత్యేక ఆఫర్
సినిమా సీన్‌ను తలపించిన తమిళనాడు ఘటన.. రూ.15 వేల ఆశతో గుండు గీయించుకున్న మహిళలు
పెద్దవంగర మండలంలో  అభివృద్ధి పనులకు శ్రీకారం
అంగన్వాడీ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు త్వరలో విడుదల
మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి గుట్ట దేవస్థానం చైర్మన్‌గా తుమ్మల శ్రీనివాస్ యాదవ్