జలసిరి పనులపై రైతులకు అవగాహన

జలసిరి పనులపై రైతులకు అవగాహన

 విశ్వంభర,  పెద్ద శంకరంపేట:  పెద్దశంకరంపేట–ఎ మండలంలోని శివాయిపల్లి గ్రామపంచాయతీలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం విత్తన మేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులకు నాణ్యమైన విత్తనాల వినియోగం, ప్రత్యామ్నాయ పంటల సాగు, ఆరుతడి పంటల ప్రాధాన్యంపై వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జలసిరి కార్యక్రమం గురించి రైతులకు ఎంపీడీవో క్రాంతి కుమార్r అవగాహన కల్పించారు. ముఖ్యంగా ఫామ్ పాండ్లు , బోర్‌వెల్ రీఛార్జ్ నిర్మాణాలు ఏర్పాటు చేయడం ద్వారా భూగర్భ జలాల మట్టం పెరిగి, వ్యవసాయానికి దీర్ఘకాలికంగా నీటి లభ్యత మెరుగుపడుతుందని వివరించారు. భూమి ఉన్న ప్రతి రైతు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని జలసిరి పనులను చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి  అఖిల్ హుస్సేన్, ఏపీఓ సంతోష్ కుమార్, పంచాయతీ కార్యదర్శి సవిత, టెక్నికల్ అసిస్టెంట్  రమేష్, రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

🕒 29 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/awareness-of-the-farmers-on-the-dam-works/article-20118

Tags:  

Advertisement

LatestNews

కదిరి కేజీబీవీలో టీచర్ నిర్వాకం.. విద్యార్థినులతో కాళ్లు పట్టించుకున్న ఘటన వైరల్
టీటీడీ పేరుతో నకిలీ వెబ్‌సైట్.. భక్తులను టార్గెట్ చేస్తున్న సైబర్ కేటుగాళ్లు
ఆగస్టు 31 వరకు ఉచిత కంటి పరీక్షలు.. అనంత‌పురంలో డా. అగర్వాల్స్ ఐ హాస్పిటల్ ప్రత్యేక ఆఫర్
సినిమా సీన్‌ను తలపించిన తమిళనాడు ఘటన.. రూ.15 వేల ఆశతో గుండు గీయించుకున్న మహిళలు
పెద్దవంగర మండలంలో  అభివృద్ధి పనులకు శ్రీకారం
అంగన్వాడీ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు త్వరలో విడుదల
మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి గుట్ట దేవస్థానం చైర్మన్‌గా తుమ్మల శ్రీనివాస్ యాదవ్