కాలనీవాసుల సమస్యకు తక్షణ స్పందించిన కౌన్సిలర్
విశ్వంభర , పరిగి: మున్సిపల్ పరిధిలోని 13వ వార్డు మందుల కాలనీలో దెబ్బతిన్న వాటర్ పైప్‌లైన్‌కు మరమ్మతు పనులను మంగళవారం పూర్తి చేశారు. కాలనీలో నీటి సరఫరాకు అంతరాయం కలుగుతున్నట్లు స్థానికులు మున్సిపల్ కౌన్సిలర్ సమీనా మీర్ తాహేర్ దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించారు. మున్సిపల్ సిబ్బందితో కలిసి సమస్య వున్న స్థలానికి చేరుకున్న కౌన్సిలర్ సమీనా మీర్ తాహేర్ అలీ, పైప్‌లైన్ మరమ్మతు పనులను దగ్గరుండి పర్యవేక్షించి పూర్తి చేయించారు. దీంతో కాలనీలో నెలకొన్న నీటి సమస్యకు పరిష్కారం లభించింది. ఈ సందర్భంగా సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకున్న కౌన్సిలర్‌కు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో వారి చొరవను అభినందిస్తూ సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది హుసైన్, కాలని వాసులు ఖదీర్, మందుల అశోక్ తదితరులు పాల్గొన్నారు.