ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం: పొన్నం ప్రభాకర్
విశ్వంభర, హైదరాబాదు : ప్రజల సమస్యలకు వేగవంతంగా పరిష్కారం అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని హైదరాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి, బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం హైదరాబాదులోని ప్రజా భవన్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని మంత్రి పరిశీలించారు. ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించి, భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు, రెండుబెడ్రూమ్ ఇళ్లు, రెవెన్యూ, మున్సిపల్, సంక్షేమ శాఖలకు సంబంధించిన ఫిర్యాదులపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అర్హులైన ప్రతి దరఖాస్తుదారుడికి న్యాయం జరిగేలా, వినతులను నిర్ణీత గడువులో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రవాసి ప్రజావాణి ద్వారా విదేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణ ప్రజల వినతులను కూడా పరిశీలించి, సంబంధిత శాఖల సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. అంతకుముందు కేంద్ర మాజీ మంత్రి, ఉత్తమ పార్లమెంటేరియన్ స్వర్గీయ ఎస్. జైపాల్ రెడ్డి 7వ వర్ధంతి సందర్భంగా నెక్లెస్ రోడ్‌లోని ఆయన స్ఫూర్తి స్థలం వద్ద మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులర్పించారు. జైపాల్ రెడ్డి ప్రజాసేవలు, పార్లమెంటరీ విలువలకు చేసిన కృషిని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి, ప్రజావాణి నోడల్ అధికారి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.