రేడియల్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న
- రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది
- ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
విశ్వంభర, పరిగి : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సహకరిస్తూ భూములు కోల్పోతున్న రైతుల సంక్షేమాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా తీసుకుంటుందని, వారికి ఎలాంటి అన్యాయం జరగకుండా మార్కెట్ విలువకు అనుగుణంగా నష్టపరిహారం అందజేస్తున్నామని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. పరిగి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్డీవో విశ్వనాథంతో కలిసి రేడియల్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న అల్లాపూర్, గూడూరు, దొంగ ఎంకేపల్లి గ్రామాలకు చెందిన రైతులకు 66 ఎకరాల భూమికి గాను రూ.16 కోట్ల 22 లక్షల 78 వేల నష్టపరిహార చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, రైతు సంక్షేమం అనే రెండు లక్ష్యాలను సమన్వయం చేస్తూ ముందుకు సాగుతోందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన జాతీయ రహదారులు, రేడియల్ రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్ సబ్‌స్టేషన్లు వంటి మౌలిక సదుపాయాల నిర్మాణం ఎంత ముఖ్యమో, వాటి కోసం భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయడం అంతే ముఖ్యమని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం రైతుల త్యాగాన్ని గౌరవిస్తూ చట్టబద్ధంగా, పారదర్శకంగా మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారంఅందజేస్తోందన్నరు.రైతులు ప్రభుత్వంపై విశ్వాసం ఉంచి అభివృద్ధి కార్యక్రమాలకు స్వచ్ఛందంగా సహకరిస్తుండటం అభినందనీయమని, అలాంటి ప్రతి రైతుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో అభివృద్ధికి కొత్త దిశ ఏర్పడిందని పేర్కొన్నారు. పరిగి నియోజకవర్గంలో ఎన్నో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న కీలక ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగుతున్నాయని తెలిపారు.పరిగి ప్రాంత అభివృద్ధిలో భాగంగా పరిగి వికారాబాద్ జాతీయ రహదారి అభివృద్ధి, పరిగి షాద్‌నగర్ రహదారి విస్తరణ, రేడియల్ రోడ్డు నిర్మాణం, లగచర్ల వరకు రహదారి అనుసంధానం, రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు, కె.పి. లక్ష్మీదేవిపల్లి సాగునీటి ప్రాజెక్టు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టిందన్నారు. ప్రాజెక్టులు పూర్తయితే పరిగి ప్రాంతానికి రవాణా, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో విశేష పురోగతి సాధ్యమవుతుందని, వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాల వల్ల ప్రజలకు శాశ్వత ప్రయోజనాలు చేకూరేలా ప్రభుత్వం కృషి చేస్తూనే, భూములు కోల్పోతున్న రైతుల భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని వారికి తగిన పరిహారం అందజేస్తోందన్నారు. రైతుల సంక్షేమం విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడదని స్పష్టం చేశారు. తమకు న్యాయమైన పరిహారం అందజేసి గౌరవించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రాంత అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని బాధితులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో వాసు చంద్ర, పరిగి ఎమ్మార్వో, వెంకటేశ్వరి, పీఏసీఎస్ చైర్మన్ పార్థసారథి పంతులు, దోమ పిఎసి చైర్మన్ యాదవ రెడ్డి, వైస్ చైర్మన్ బద్రి గారి రాజ పుల్లారెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు వెంకట్ రాములు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, కోఆప్షన్ సభ్యులు ఆంజనేయులు,కాంగ్రెస్ నాయకులు అశోక్, మహేష్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.