హైడ్రా తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలి: సీపీఐ
విశ్వంభర, హైదరాబాదు : హైడ్రాపై హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి.ఎస్. బోస్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో కోరారు. హైడ్రా విధి నిర్వహణలో కొన్ని లోపాలు ఉన్నా చెరువులు, ప్రభుత్వ భూములను కాపాడి ప్రజా ఆస్తిని రక్షించిందన్నారు. కాలనీల్లో పార్కు స్థలాలు, ప్రభుత్వ భూములను భూ కబ్జాదారుల నుంచి రక్షించడంలో హైడ్రా కీలక పాత్ర పోషించిందని తెలిపారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో హైడ్రా స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. భూ ఆక్రమణదారులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, హైడ్రాపై వచ్చిన ఆరోపణలకు చట్టపరమైన స్పష్టత కోసం వెంటనే సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.