జైపాల్ రెడ్డి సేవలు చిరస్మరణీయం: చిన్నారెడ్డి
విశ్వంభర, ఖైరతాబాదు: కేంద్ర మాజీ మంత్రి, ఉత్తమ పార్లమెంటేరియన్ దివంగత ఎస్. జైపాల్ రెడ్డి 7వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి మంగళవారం హైదరాబాదు నెక్లెస్ రోడ్‌లోని జైపాల్ రెడ్డి ఘాట్ వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హాజరై జైపాల్ రెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ, జైపాల్ రెడ్డి రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన గొప్ప ప్రజానాయకుడని అన్నారు. ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి, పార్లమెంటరీ వ్యవస్థ గౌరవాన్ని పెంచిన నాయకుడిగా ఆయన చిరస్థాయిగా గుర్తుండిపోతారని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేసిన జైపాల్ రెడ్డి సేవలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగించడం ద్వారానే నిజమైన నివాళి అర్పించినవారమవుతామని చిన్నారెడ్డి అన్నారు.