ఇన్-సర్వీస్ శిక్షణతో విద్యార్థుల అభ్యాస ఫలితాలు మెరుగుపడాలి
- డీఈవో అల్వాల సత్యనారాయణమూర్తి
విశ్వంభర, మహబూబాబాద్ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అభ్యాస ఫలితాలను మెరుగుపరచేందుకు ఉపాధ్యాయులు ఇన్-సర్వీస్ ఇంటిగ్రేటెడ్ టీచర్ ట్రైనింగ్‌లో నేర్చుకున్న బోధనా విధానాలను తరగతి గదుల్లో సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి అల్వాల సత్యనారాయణమూర్తి సూచించారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇన్-సర్వీస్ ఇంటిగ్రేటెడ్ టీచర్ ట్రైనింగ్ – ట్రాన్స్‌ఫార్మేటివ్ క్లాస్‌రూమ్ ప్రాక్టీసెస్ అండ్ ఫార్మేటివ్ యాక్టివిటీస్ శిక్షణ కార్యక్రమంలో వ్యాయామ విద్య ఉపాధ్యాయులు (పీఈటీలు), పీడీలు, గణిత ఉపాధ్యాయులు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థి కేంద్రిత బోధనకు ప్రాధాన్యం ఇస్తూ ప్రతి విద్యార్థి తరగతి గదిలో చురుకుగా పాల్గొనేలా ఫార్మేటివ్ కార్యకలాపాలను అమలు చేయాలని సూచించారు. నిరంతర మూల్యాంకనం ద్వారా విద్యార్థుల అభ్యాస స్థాయిని అంచనా వేసి అవసరమైన విద్యా సహాయాన్ని అందిస్తే అభ్యాస ఫలితాలు గణనీయంగా మెరుగుపడతాయని పేర్కొన్నారు.వ్యాయామ విద్య ఉపాధ్యాయులు విద్యార్థుల్లో శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, జట్టుగా పనిచేసే నైపుణ్యం, నాయకత్వ లక్షణాలను పెంపొందించే దిశగా కృషి చేయాలని సూచించారు. గణిత ఉపాధ్యాయులు భావనాత్మక బోధన, కార్యాచరణ ఆధారిత అభ్యాసం, సమస్యల పరిష్కార విధానాల ద్వారా విద్యార్థుల్లో గణితంపై ఆసక్తి పెంచాలని కోరారు. ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులకు నిరంతర విద్యా మార్గదర్శకత్వం అందిస్తూ, నాణ్యమైన బోధన, సమగ్ర ప్రణాళిక, విద్యార్థుల అభ్యాస పురోగతిపై క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. శిక్షణలో నేర్చుకున్న వినూత్న బోధనా పద్ధతులు, తరగతి గది కార్యకలాపాలు, మూల్యాంకన విధానాలను ప్రతి ఉపాధ్యాయుడు పాఠశాలల్లో అమలు చేసి ప్రభుత్వ పాఠశాలల విద్యా ప్రమాణాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సెంటర్ ఇన్‌చార్జి ఏసీజీఈ మందుల శ్రీరాములు, క్వాలిటీ కోఆర్డినేటర్ ఎం. వెంకటేశ్వర్లు, రిసోర్స్ పర్సన్లు చాంప్లా నాయక్, సుమన్ బాలాజీ, యాకయ్య, వేద ప్రకాష్ మంగు తదితరులు పాల్గొన్నారు.